బట్టల తీగ

తీగ మీద ఆరబెట్టిన బట్టలను చూడటంలో ఏ దో ఒకరకమైన సంతృప్తి ఉంటుంది. అప్పటివరకు నిర్జీవంగా కనిపించే వాకిలి బట్టల తీగ మీద బట్టలు పడగానే ప్రాణం పోసుకున్నట్టు కళ కళ లాడిపోతోంది. దాని మీద ఆరేసిన బట్టల నుండి జల్లేదాడిన ఉదయపు సూర్యరర్మి  దాని ముందున్న నా బెడ్ రూంలోకి చొరబడి నా గదిని ఆరేసిన బట్టలు రంగులోనే ముంచేస్తుంది.

చిట్టి కప్పా

నేను నిన్ను అలా పిలవడం నాకు ఎంత ఇష్టమో కదా. నిన్ను నీ పూర్తి పేరుతో ఎప్పుడూ పిలవనే లేదు, మొదటిసారి కూడా ఆదిత్య అలా పిలవాలంటే ఏదోలా ఉంటుంది.నీకు కూడా అలా పిలిపించుకొవడం ఇష్టం ఉండేది కాదు కదా. ఎప్పుడూ అనే వాడివి ఎంత మంది ఉన్నా,నువ్వు నన్ను ఆదీ అనే పిలవాలి అని ,నేను ఆదీ అంటే ఆ కుసూ అనేవడివి,నేను నవ్వేసేదన్ని.

నూర్జహాన్

ప్రాతఃకాల సమయం మంచి ధ్యానంలో ఉన్నాను.అప్పుడే విరామం లేకుండా నా తలుపు తడుతున్న భయంకర శబ్ధం .నా తపస్సు భంగం చేయడానికి వచ్చిన రాక్షసులు ఎవరో నాకు బాగా తెలుసు.ఈ సారి వారి చేష్టలు ఫలించకుడదని భీష్మించుకుని ఏమీ వినబడనట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాను.కానీ చెవులకు ఏమీ చెయ్యను? తలుపు మీద రాక్షసుల విధ్వంసకాండ ఆగలేదు.

 

Visit Us On TwitterVisit Us On FacebookVisit Us On YoutubeVisit Us On Instagram